Monday, May 2, 2011

బ్లాగ్ సోదర సోదరీమణులారా!

హాయ్ నేనొక క్రొత్త తెలుగు బ్లాగ్గర్ని . పరమోత్సాహంతో వచ్చాను . నాకు సంగీతమంటే ప్రాణం .
అందులోను శాస్త్రీయ సంగీతం అంటే చాల ప్రియం . త్యాగయ్య , అన్నమయ కీర్తనలు ఎక్కువగా వింటూంటాను.నేదునూరి గారు , సుబ్బులక్ష్మిగారు పాడినవి వీనులవిందే.విని పరవశిస్తూ వుంటాను. ఇక అన్నమాచార్యుల కీర్తనలను గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతుంటేనే అందం.ఆయనంత చిక్కగా చక్కగా పాడేవారు అరుదు. ఇక కన్నడంలో లక్షా నలుబదివేల కీర్తనలను రచించిన పురందర దాసు కీర్తనలను,

కన్నడ గాయకులు ( పేర్లు తెలియవు) పాడినవి విన్నాను . అద్భుతం .మీకు తెలిసినవి నాతొ పంచుకోగలరు. సంగీతమే కాక ప్రాత తెలుగు పిక్చర్స్ (79 లోపువి) ఇష్టం.
హిందీ పిక్చర్స్ కూడా.
ముఖ్యంగా వాటిలోని మ్యూజిక్ చాల ఇష్టం .తరువాత జ్యోతిషం కూడా చూస్తూ వుంటాను . కామెడీ ఇష్టం . వీటిని నలుగురితోను పంచు కోవాలి అనుకుంటున్నాను . సోది అనుకోవద్దు .ప్లీజ్. తోచినవి వ్రాస్తూంటాను.
చదువుతారుకదా!

2 comments: